300 ఏళ్ల నాటి నాగలింగేశ్వర స్వామి ఆలయానికి పూర్వవైభవం

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో 300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆదివారం భూమిపూజ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రూ. 1. 5 కోట్ల CGF నిధులతో, పెన్నా నది ఒడ్డున 5 ఎకరాల్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. గ్రామస్థుల చిరకాల కోరిక మేరకు, సనాతన సంప్రదాయం ఉట్టిపడేలా శిల్పకళా నైపుణ్యంతో ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. భావితరాలకు ఆధ్యాత్మికత, సంస్కృతిని అందించే ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్