నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం

బంగాళాఖాతంలో సంభవించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో  నెల్లూరు జిల్లాలో వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు.  ఈ క్రమంలో గురువారం వెంకటగిరిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు కాలనీల్లో వర్షపునీరు చేరి ప్రజలు అవస్థలకు గురయ్యారు. అదే విధంగా పంట కోతలు చేసుకున్న రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అలాగే చేతికొచ్చే దశలో ఉన్న పంటలు కూడా దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్