నెల్లూరులోని హరినాథపురం రెండో వీధిలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు జ్యోతి (11), అమూల్య (7) ఇంటి మిద్దెపై ఆడుకుంటుండగా, వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో తో నీళ్లు కిందపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ తీగ తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.