నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇడిమేపల్లి నుంచి జోసఫ్ పేటకు నారేత వేసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బైక్ ను తప్పించబోయి ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలయ్యాయి. నెల్లూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్