తాటిపర్తిలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

పొదలకూరు మండలం తాటిపర్తిలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లు, డీబీటీ రికార్డులు, ఏపీఏఐఎంఎస్ వివరాలను పరిశీలించగా పలు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. చైతన్య ఫర్టిలైజర్స్ లో 34. 60 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం గుర్తించి, వాటి విలువ రూ. 9, 84, 190గా నిర్ధారించారు. అలాగే బాలాజీ ఫర్టిలైజర్స్ లో 76. 515 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం బయటపడింది.

సంబంధిత పోస్ట్