మద్యం మత్తులో జరిగిన వివాదం బేల్దారి హత్యకు దారి తీసింది. జాకీర్ హుస్సేన నగర్ కు చెందిన సుల్తాన్(38)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాపీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. బుధవారం రాత్రి మద్యం తాగేందుకు పెన్నానది వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ మైపాడు రోడ్డుకు చెందిన నాగరాజు, కలీమ్ మద్యం తాగుతున్నారు. సుల్తాన్ వారి మధ్య మాటామాట పెరిగి తల పగలకొట్టి, బీరు బోటిళ్లతో సుల్తాన్ ను హత్య చేశారు.