బెదిరింపులు, కిడ్నాప్‌లు, మోసాలకు పాల్పడిన తీవ్ర నేరస్వభావం ఉన్న నిడిగుంట అరుణపై PD యాక్ట్ రద్దు చేయడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నెల్లూరు, విజయవాడ పరిసరాల్లో దందాలకు పాల్పడిన అరుణను గత డిసెంబర్‌లో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. అరుణను విడుదల చేయాలంటూ ఆమె తల్లి ఆదిలక్ష్మి పెట్టుకున్న వినతిని ప్రభుత్వం తిరస్కరించింది. నిర్బంధ ఉత్తర్వులు కొనసాగుతాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.