గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం నెల్లూరు వేదాయపాలెం- నెల్లూరు రైల్వే స్టేషన్ మధ్యలో చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్. హరిచందన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి పాచిరంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు, ఎడమ చెవికి సిల్వర్ కలర్ పోగు, ఒంటిపై జ్యందం ధరించి ఉన్నారు.