నెల్లూరు: దారి దోపిడీ కేసులో 6 మంది అరెస్ట్

నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ లో రైలులో దిగి ఆత్మకూరు బస్టాండుకు నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఆరుగురు నిందితులను నెల్లూరు సంతపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సంగం మండలం మర్రిపాడుకుకు చెందిన శనగ వీరరాఘవయ్య పది రోజుల కిందట హైదరాబాద్ నుంచి వచ్చి ఆత్మకూరు బస్టాండుకు నడుచుకుంటూ వెళుతుండగా సింహపురి హోటల్ వద్ద ఆరు మంది నిందితులు బెదిరించి నగదు దోచుకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్