నెల్లూరు: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై నెల్లూరు దర్గామిట్ట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈ నెల 10న కొండా యపాలెం గేటు వద్ద సుమారు 30 ఏళ్ల వయసుండే గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి 108 సాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్