డ్రోన్ నిఘా లో నెల్లూరు జిల్లా

ప్రజల భద్రత, అవాంఛనీయ సంఘటనల నివారణ కోసం నెల్లూరు పోలీసులు అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా చేపట్టారు. ఆకాశం నుంచి పలు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద కదలికలను గుర్తించి తక్షణ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఆదివారం  రాత్రి కూడా నెల్లూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో డ్రోన్ తనిఖీలు నిర్వహించారు. నేరాల నియంత్రణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారుతుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్