నెల్లూరు జిల్లా: గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో గూడూరు వైపు వస్తున్న మినీ వ్యాన్‌ను లారీ ఢీ కొట్టింది. సోమయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిల్లవాండ్లపల్లి నుంచి చిల్లకూరులోని సంతకు గొర్రెలను తీసుకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.