మంత్రి నారాయణ కీలక నిర్ణయం టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అసెంబ్లీలో వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140 కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు.