అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్త, అత్తింటి వారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు, నెల్లూరు నగరంలోని జెండావీధికి చెందిన లియాకు చెన్నై నగరానికి చెందిన పర్వేజ్ తో వివాహమైంది. వివాహ సమయంలో లియా కుటుంబ సభ్యులు కట్నకానుకుల కింద రూ. 7 లక్షల నగదు, 25 సవర్ల బంగారు ఆభరణాలు, రూ. 3 లక్షల విలువ చేసే గృహోపకరణాలు ఇచ్చారు. అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు