వెంకటాచలం మండలంలోని అబ్బిసాహెబ్ కండిగ గ్రామంలో గురువారం దారుణ హత్య చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వామిటిపర్తి గ్రామానికి చెందిన పచ్చిపాల బాబు తన భార్య పచ్చిపాల భారతి పై గత కొన్ని రోజులుగా అనుమానం పెంచుకొని తరచూ గొడవపడుతున్నాడు. అబ్బిసాహెబ్ కండిగ గ్రామంకు రాగా భార్యాభర్తలకు వివాదం వచ్చి భారతి పై భర్త బాబు కత్తితో దాడి చేశాడు.