మనుబోలు: రోడ్డు దాటుతున్నంగా వృద్ధుడిని ఢీకొట్టిన బైక్

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం క్రాస్ రోడ్డు వద్ద హైవేపై శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలైన వైనమిది. పనుల నిమిత్తం గూడూరు రూరల్ మండలం పరిధిలోని పుట్టం రాజు కండ్రిగ గ్రామానికి చెందిన వెంకటయ్య మనుబోలు కి వచ్చాడు. యాచవరం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న మోటార్ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్