బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద కారు బోల్తా

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద ఒక కారు బోల్తా పడిన ఘటన గురువారం జరిగింది. నాయుడుపేట నుంచి నెల్లూరు వస్తున్న ఓ కారు బద్దెవోలు వద్ద అదుపు తప్పి, గూడూరు నుంచి మనుబోలు మండలంలోని కట్టుపల్లికి స్కూటీపై వెళ్తున్న ఏఎన్ఎం ఇంద్రసేన ను ఢీకొట్టింది. ఇదే క్రమంలో కారు కూడా రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్