మనుబోలు: వృద్ధురాలిపై దాడి.. బంగారు ఆభరణాల చోరీ

పిడూరు రోడ్డులోని సాయిబాబా ఆలయ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు ప్రభావతమ్మపై గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి లోపలికి వచ్చి దాడి చేశాడు. నగలు ఇస్తావా లేదంటే చంపేస్తానని బెదిరించి, మెడలోని నాలుగు సవర్ల దండ, మూడు సవర్ల గాజులు, అరసవర ఉంగరం తీసుకొని పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్