మనుబోలు: విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

విద్యుత్ ఘాతంతో మండలంలోని మడమనూరు గ్రామంలో ఆదివారం రాత్రి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కొణితం మస్తానయ్య (40) ఇంట్లో నిద్రపోతూ మలమూత్ర విసర్జనకు ఆరు బయటికి వెళ్లాడు. అక్కడ గాలికి 8విద్యుత్ తీగ తెగి పడి ఉండటం గమనించలేదు. తీగ కాలికి చుట్టుకొని తీవ్ర విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై శివ రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సోమవారం దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్