నాయుడుపల్లి: వృద్ధుల మిస్సింగ్ పై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరా

మనుబోలు మండలం నాయుడుపల్లికి చెందిన కోటపాటి సుబ్బయ్య, కోటపాటి రత్నయ్య గత నెల 26న మర్రిపాడు మండలంలోని మల్లెంకొండ దర్శనానికి వెళ్లి మిస్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. శనివారం నాయుడుపల్లిలో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసారు. బాధితుల ఇంటి వద్ద నుంచే ఫోన్ లో ఎస్పీ కృష్ణకాంత్ తో సోమిరెడ్డి మాట్లాడారు. గాలింపు చర్యలను ఉధృతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్