రికార్డు ఆధారంగానే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని మండల తాహసిల్దార్ స్వప్న అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని సమస్యలకు సంబంధించి గ్రామస్థాయి నుంచి తగిన నివేదిక తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధానంగా రైతులు సహకారం ఉంటేనే రైతులకు న్యాయం చేయగలుగుతామని పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు ఇచ్చే విషయంలో రెవెన్యూ శాఖ చక్కగా పనిచేస్తుందన్నారు.