వెంకయ్య స్వామి దేవాలయంలో పంచామృత అభిషేకం, అన్నదానం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లిలోని మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో శనివారం అర్చకులు శ్రీనివాసులు స్వామివారికి పంచామృత అభిషేకం, నూతన పట్టు వస్త్రధారణ, దుని పూజ నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బట్టేపాటి రంగారెడ్డి, అసిత దంపతులు ఉదయకర్తలుగా వ్యవహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕