తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో శనివారం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు 11 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులకు సమాచారం అందడంతో వారు గ్రామానికి చేరుకున్నారు.