మర్రిపాడు మండలం చాబోలు గ్రామంలో ఆదివారం పోలేరమ్మ ఆలయ జాతర సందర్భంగా, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా వాలంటీర్స్ విభాగం ప్రధాన కార్యదర్శి గోపి శశికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా, యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువత పాల్గొన్నారు.