దుత్తలూరు మండలం వెంగనపాలెం గ్రామ పంచాయతీలో కొత్తగా 11కె వి లైన్ ద్వారా 3ట్రాన్స్ ఫార్మర్లకు కొత్తగా కనక్షన్ ఇచ్చారు. అందువలన పంచాయతీలో ఉన్న స్థంబాలన్నింటికి కొత్తగా క్లాంపులు, లైట్లు పంచాయతీ తరుపున సర్పంచ్ తిపిరిబోయిన పెద వెంగయ్య శనివారం దగ్గరుండి వేయించారు. పంచాయతీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.