ఉదయగిరికి డయాలసిస్ కేంద్రం.. పేదల ప్రాణాలకు భరోసా!

ఉదయగిరి సీహెచ్‌సీలో 5 డయాలసిస్ యంత్రాలతో కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీ రోగులకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఎంతో ఊరట కలగనుంది. డయాలసిస్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ కేంద్రం ఆపన్నహస్తంగా నిలవనుంది. ఈ నిర్ణయంపై సీతారామపురం మాజీ జడ్పీటీసీ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలు కలివెల జ్యోతి హర్షం వ్యక్తం చేసి, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌లకు కలివెల జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా సేవలు ప్రారంభించి బాధితులకు అండగా నిలవాలి” అని  కోరారు.

సంబంధిత పోస్ట్