25న సీతారామపురంలో విద్యుత్ అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం సీతారామపురం ఎంపీడీవో కార్యాలయంలో విద్యుత్ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు భోగినేని చిన్న కాశయ్య తెలిపారు. విద్యుత్ సరఫరా, మీటర్లు, వ్యవసాయ విద్యుత్ సమస్యలపై వినియోగదారులకు అవగాహన కల్పించడంతో పాటు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుడారి తిరుపాలు, విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, ఫోరం ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు. వినియోగదారులు సదస్సుకు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕