నందిపాడులో వేగంగా ఎస్ఐఆర్ ప్రక్రియ

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం శుక్రవారం వేగంగా కొనసాగింది. బీఎల్ఏ అశోక్, బీఎల్‌ఓ మహేంద్ర ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి వెరిఫికేషన్ ఫారాలను స్వీకరించారు. ఓటర్లకు ఫారాల నింపడం, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. నందిపాడు పోలింగ్ స్టేషన్ నంబర్–130 పరిధిలో ఇప్పటివరకు 400 వెరిఫికేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్