వింజమూరులో విద్యుత్ స్తంభానికి మంటలు

శనివారం ఉదయం వింజమూరు పట్టణంలోని మెయిన్ రోడ్ లోని బాలాజీ జ్యూస్ షాప్ వద్ద కరెంట్ స్తంభానికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు కాలిపోయాయి. పక్కనే షాపులు ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్