ఉదయగిరి కొండపై ఈరోజు కూడా మంటలు

నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండకు ఈరోజు కూడా నిప్పు అంటుకుని మంటలు ఏర్పడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు నిన్న అనగా గురువారం ఏర్పడిన మంటలు అప్పటినుంచి అలాగే రగులుతున్నట్లు తెలిపారు. ఎంతో పెద్ద వెడల్పైన ఈ కొండపై అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఈ విధంగా మంటలు ఏర్పడడం అనేది వాటన్నిటికీ ముప్పును తెచ్చిపెడుతుంది. ఇలా కొండలకు నిప్పు పెడితే అడవిలో ఉండే జంతువులు ప్రజల నివాసాల మధ్యకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్