ఉదయగిరిలో భారీ వర్షం

ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉండి, సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వారం రోజులుగా తీవ్ర ఎండతో సతమతమవుతున్న రైతులు, ప్రజలు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕