నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో శనివారం సాయంత్రం సమయంలో మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండగా ఉండి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని వర్షం కురవసాగింది. ఇటీవల కాలంలో కాసిన తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు. చిరు వ్యాపారస్తులు, ప్రయాణికులు వర్షం వల్ల కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు.