జలదంకి: పాము కాటుకు గురైన మహిళ

ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఓ మహిళ పాము కాటుకు గురైన ఘటన ఆదివారం తెలిసింది. జలదంకి మండలం వేములపాడు గ్రామంలోని వాగులో పూడిక తీత పనులు చేస్తుండగా రామలక్ష్మమ్మ కాలుకు పాము కాటేసింది. క్షేత్ర సహాయకురాలు చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఏపీఓ శ్రీనివాసులు, టిఏ రంగారెడ్డి ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడారు. విష సర్పం కాదని పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్