నెల్లూరు జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఆటోలో వ్యవసాయ పనుల కోసం ప్రయాణం చేస్తున్న గరిమెన పెంట గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎస్కె. దిల్ మేషా అనే మహిళ మృతి చెందింది. క్షతగాత్రులను వెంటనే కావలిలోని ఆసుపత్రికి తరలించారు.