కొండాపురం మండలం కొమ్మి పంచాయతీ రామానుజపురం గ్రామానికి చెందిన బండ్లమూడి దొరసాని ఇల్లు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. దీంతో వారు నిరాశ్రయులయ్యారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వింజమూరులోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా వారికి ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరు చేయించి, నిర్మించి ఇస్తామన్నారు.