నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మర్రిగుంట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అప్రమత్తమై అక్రమ రేషన్ బియ్యం రవాణాకు గ్రామస్తులు అడ్డుకట్ట వేశారు. 70 బస్తాల బియ్యంతో కావలి వైపు వెళ్తున్న మినీ ట్రక్కును గ్రామస్తులు నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆలస్యంగా స్పందించారని ఆరోపణ. వీరి తీరు విమర్శలకు దారితీసింది. ఇటీవల నెల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదేవిధంగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.