వింజమూరు మండలంలో ఓ ఇంట్లో భారీ చోరీ

వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 15 సవర్ల బంగారం, 50 వేలు నగదు అపహరణకు గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీ చేసినట్లు బాధితులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్స్ ద్వారా పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్