నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయం ఆధునికరణ పనుల్లో భాగంగా ముందు భాగంలో ఉన్న ఏళ్ల నాటి చెట్లను కొట్టేశారు. దశాబ్దాల కాలం నుంచి ఉన్న చెట్లు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎంతో నీడని ఇచ్చేవి. సమీపంలో ఉన్న వ్యవసాయ, ఐసీడీఎస్, ఉపాధి హామీ, విద్యాశాఖ, పొదుపు కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా ఈ చెట్ల వద్దనే సేద తీరుతారు. వాటిని తొలగించడంతో ప్రజలకు నీడ కరువైనట్లయింది.