కొండాపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పవర్ కట్

నెల్లూరు జిల్లా కొండాపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ఏఈ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మత్తులు కారణంగా ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు ఉండదు. మధ్యాహ్నం 2 గంటల తరవాతే విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్