సీతారామపురం మండలంలోని ఎంపీపీ స్పెషల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఏ-1 పరీక్షలను ఎంఈవో మస్తాన్ వలి పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేసి, పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రహమతుల్లా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.