సీతారామపురం మండలంలో జోరుగా సాగుతున్న SIR కార్యక్రమం

ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలంలో SIR కార్యక్రమం అత్యంత వేగంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా సోంపల్లి, పొలాంగారిపల్లి, అయ్యవారిపల్లి, సింగారెడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాసులు, విఆర్ఓ వంశీ కృష్ణ, పార్టీ కార్యకర్తలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్