ఉదయగిరిలో SIR కార్యక్రమం విజయవంతం

ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో 202వ బూతులో SIR కార్యక్రమం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్గనిర్దేశంలో విజయవంతంగా ముగిసింది. బీఎల్ఏ యరసింగు మహేష్ పర్యవేక్షణలో ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఎన్యూమరేషన్ ఫార్ముల పంపిణీ, సేకరణ, డిజిటల్ ఎంట్రీ ప్రక్రియలు వేగంగా పూర్తయ్యాయి. ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రక్రియలో డూప్లికేట్, మరణించిన ఓటర్ల మ్యాపింగ్ సమస్యల పరిశీలన మాత్రమే మిగిలి ఉంది. పార్టీ శ్రేణుల కృషి వల్ల సాయిపేట బూత్ ప్రగతి పథంలో దూసుకెళ్తోంది.

సంబంధిత పోస్ట్