సీతారామపురం మండలంలో సెలవు రోజుల్లోనూ SIR వెరిఫికేషన్

సీతారామపురంలో ( SIR) సర్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం, ఆదివారం సెలవు రోజుల్లోనూ నోటీసులపై విచారణ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ షేక్. ఫజిహా, ఎంపీడీవో చిన్న చెన్నారావు తెలిపారు. జిల్లా కలెక్టర్, డిప్యూటీ సీఈఓ ఆదేశాల మేరకు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. బీఎల్వోలు ప్రజలకు సమాచారం అందించి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్