నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో సుమారు 20 నిమిషాల నుంచి ఆగకుండా ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తుండడంతో ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడం మంచిదయింది. గాలుల తీవ్రతకు చెట్లు విరిగి పడే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా గాలులు రావడంతో వర్షం పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఇప్పటికే వడిగిళ్ళ వర్షం కురుస్తుంది.