వింజమూరులో డాక్టర్ మాసిలామణి చిన్నపిల్లల ఆసుపత్రిలో బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బర్డిట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సభ్యులు డాక్టర్ మాసిలామణిని సన్మానించారు. ఈ సందర్భంగా చర్చి సెక్రటరీ బకీరు జాషువా మాట్లాడుతూ, వైద్యులు ప్రాణదాతలని, అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే వారిని దేవుడితో సమానమని కొనియాడారు.