దుత్తలూరులో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించిన ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ, అధికారుల విధులు మరియు సిబ్బంది ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మరియు పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕