ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందిన ఇంగ్లీష్ అధ్యాపకులు బి. శ్రావణ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఉదయగిరి మండలం దాసరి పల్లెలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి భోజనం అనంతరం ఛాతీలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీతారాంపురం ఎల్. వి. ఆర్ కళాశాలలో కూడా ఈయన పని చేశారు.