ఉదయగిరి: యదేచ్ఛగా అక్రమ గ్రావెల్ రవాణా

కలిగిరి మండలంలోని రావులకొల్లు చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలిగిరి- వలేటివారిపాలెం రోడ్డు నిర్మాణానికి నెల రోజులుగా భారీగా మట్టిని తరలిస్తున్నారని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్