ఉదయగిరి మండలం రంగనాయుడు పల్లి లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సవరం చిన్న లక్ష్మయ్య (35) ఆర్థిక సమస్యలు భరించలేక శుక్రవారం మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఐదుగురు ఆడపిల్లలు, 12 ఏళ్ల ఒక బాలుడు ఉన్నాడు. ఇటీవల ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఇబ్బందులు భరించలేక మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.