ఉదయగిరి: జిరాక్స్ మిషన్ లో పాము కలకలం

ఉదయగిరిలోని ఓ జిరాక్స్ షాపులో పాము దూరి కలకలం రేపిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న జిరాక్స్ దుకాణంలో అందరూ చూస్తూ ఉండగానే పాము జిరాక్స్ మిషన్లోకి దూరిపోయింది. దీంతో ఒక్కసారిగా జిరాక్స్ తీసుకునేందుకు వచ్చిన వారు, యజమాని భయభ్రాంతులకు గురై జిరాక్స్ మిషన్ ను బయటికి లాగేశారు. మెకానిక్ వచ్చి మిషన్లో ఉన్న పాము మాత్రం బయటకు రాకపోవడంతో చూసేందుకు జనం గుంపులుగా నిల్చున్నారు.

సంబంధిత పోస్ట్